
-సినిమా పేరు: మాయలేడీ
-నటీనటులు:రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, సురేష్, ఇంద్రజ, సత్య, మధురిమ, లావణ్య రెడ్డి తదితరులు
-సినిమాటోగ్రఫీ: యదు రాధాకృష్ణన్
-ఎడిటింగ్: రవితేజా గిరజాలా
-మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
-నిర్మాత: రాకేష్ వర్రే
-బ్యానర్: క్రేజీ ఆంట్స్ ప్రొడక్షన్
-రచన,దర్శకత్వం: ప్రశాంకర్
-రిలీజ్ డేట్ : నవంబర్ 13 ,2026
ప్రచార చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న మూవీ 'మాయలేడి'. బాహుబాలి ఫేమ్ రాకేష్ వర్రే హీరో. నటనలో ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్న బెంగాలీ భామ 'మధుమిత సర్కార్' హీరోయిన్ తో పాటు టైటిల్ రోల్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రిషి( రాకేష్) ఆదర్శ భావాలు గల వ్యక్తి. సెల్ఫ్ డిఫెన్స్ సెంటర్ నడుపుతూ ఆడవాళ్లు సొసైటీ నుంచి ఏర్పడే ఇబ్బందుల వల్ల భయపడకుండా దైర్యంగా ఉండాలని మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తుంటాడు. తన భావాలకి, భావజాలానికి సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే సింగిల్ గా ఉండాలని అనుకునే మెంటాలిటీ. ఆష(మధుమిత సర్కార్).. ఎవరైనా తమ లైఫ్ లో మెమొరీబిల్ గా భావించే వస్తువులని పోగొట్టుకుంటే వాటిని వెతికి ఇచ్చే సంస్థని నడుపుతూ ఉంటుంది. ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పదిశాతం కమర్షియల్, తొంబై శాతం ఎమోషనల్. చాలా మంచి తనం,పద్ధతి గల అమ్మాయి.రూప( మధుమిత సర్కార్) చాలా ఫాస్ట్ గర్ల్. నైట్ పబ్ లకి వెళ్లే రకం. ఫుల్ బాటిల్ మద్యం తాగే కెపాసిటీ తన సొంతం.తనని ఎవరైనా హర్ట్ చేసినా, తాను నా సొంతమే అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టినా చిన్న సైజు సైకోలో మారిపోయే రకం. ఆష, రూప ఇద్దరు రిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. రిషి కూడా ఇద్దరని అంతే ప్రాణంగా ప్రేమిస్తాడు.కానీ ఆ తర్వాత ఆష, రూప గురించి రిషికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. రిషికి ఆ ఇద్దరి గురించి తెలిసిన నిజం ఏంటి? ఆదర్శ భావాలు గల వ్యక్తి ఇద్దరిని ఎలా ప్రేమించాడు? అసలు మాయలేడి అంటే ఏంటి అనేదే ఈ చిత్రం.
ఎనాలసిస్
ముందుగా మాయలేడి అని ఎందుకు టైటిల్ గా ఫిక్స్ అయ్యారో తెలియదు. ఎందుకంటే కొంత మంది ప్రేక్షకులు మగ వాళ్ళని మోసం చేసే అమ్మాయి కాబట్టి ఆ టైటిల్ ఉంచారమో అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి క్రేజీ లేడీ లాంటి ఇన్నోసెంట్ టైటిల్స్ ని ఫిక్స్ అయ్యుండాల్సిందేమో. మూవీ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి చివరి వరకు మంచి స్క్రీన్ ప్లే తో సాగింది. కాకపోతే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పై మరింత శ్రద్ద పెట్టాల్సింది.
మాయలేడి లాంటి కథలకి ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే ఎండ్ చేయాలి. హీరో క్యారక్టరయిజేషన్ కూడా ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. మొదటి భాగంలో చూసుకుంటే హీరో ఇంట్రడక్షన్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ రొటీన్. ఎప్పుడైతే ఆషా క్యారక్టర్ ఎంటర్ అయ్యిందో మూవీకి మంచి బూస్టప్ వచ్చింది. ముఖ్యంగా ఆష నడిపే సంస్థ యొక్క కాన్సెప్ట్ సూపర్. ఆ బేస్ పైనే ఎంటర్ టైన్ మెంట్ కోణంలో రిషి, రిషి ఫ్రెండ్ గణేష్( సత్య) ఆషా మధ్య సీన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. రూప, రిషి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఒక రేంజ్. సెకండ్ హాఫ్ లో వచ్చిన చాలా ట్విస్ట్ లు మెస్మరైజ్ చేస్తాయి. ముఖ్యంగా ఆష, రూప మధ్య వేరియేషన్ తో నడిచిన కథనం, రిషి వెనక్కి వెళ్లిపోకుండా ప్రేమ కోసం నిలబడటం చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ విషయంలో మరింత శ్రద్ద చూపించాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు
రిషి క్యారక్టర్ లో ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో, అన్నిటిలోను రాకేష్ వర్రే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసాడు. కానీ హీరో కట్ అవుట్ లుక్ మాత్రం కలగలేదనేది నిజం. ఆష, రూపగా మధుమిత సర్కార్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మ్ ఇచ్చింది. అంతలా రెండు క్యారక్టర్ లలో మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ తో సెల్యులాయిడ్ ని రఫ్ఫాడించింది. మూవీకి అతి పెద్ద బలంగా కూడా నిలిచింది. సత్య రొటీన్ కామెడీ. బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే బోర్ కొట్టేసే ప్రమాదం ఉంది. సురేష్ తో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా తమకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. ప్రశాంకర్ దర్శకుడిగా భారీ స్థాయిలోనే మెప్పించాడు. రచయితగా హీరో బ్యాక్ గ్రౌండ్ పై మరింత శ్రద్ద చూపించాల్సింది. నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన హైలెట్.
బలాలు
1 .మధుమిత సర్కార్ వన్ ఉమెన్ షో
2 . దర్శకత్వం
బలహీనతలు
1 .క్లైమాక్స్
ప్రేక్షకులని పూర్తి స్థాయిలో మెప్పించడానికి వచ్చి, పర్వాలేదనిపించారు.. హీరోయిన్ క్యారక్టర్ ప్రధాన బలం.
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం




.webp)
