ఎన్టీఆర్‌ని మర్చిపోని ఆలియా... స్వీట్ రిప్లై ఇచ్చిన తారక్!
on Mar 26, 2023
సినిమాల్లో కలిసి పనిచేసిన బంధం ఎప్పటిదాకా ఉంటుందంటే, ఆ షెడ్యూల్ పూర్తయ్యేవరకు. మహా అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు. కొన్నిసార్లు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో పాల్గొనే వరకు అని అనుకుంటే మాత్రం మీరింకా పాతకాలంలో ఉన్నట్టే. ఇప్పుడు బంధాలు బియాండ్ ద మూవీస్ వెళ్తున్నాయి. సినిమాలతో పనేంటి? కొంచెం టచ్‌లో ఉంటే చాలు అనుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇప్పుడు ఆలియా, తారక్ ఫ్రెండ్షిప్ చూసిన వారు కూడా ఈ మాటలనే అనుకుంటున్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్‌చరణ్ సరసన నటించారు ఆలియా. కానీ ఆమెకు చరణ్‌తో పోలిస్తే తారక్‌తోనే మరిన్ని సీన్లున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలోనూ తారక్ - ఆలియా చాలా బాగా స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఆలియా పెళ్లి, ప్రెగ్నెన్సీ లేకపోయి ఉంటే, ఎన్టీఆర్ 30లో ఆమెనే హీరోయిన్గా నటించే ఛాన్సులున్నాయని కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
సినిమా చేయకపోయినా, తారక్‌తో టచ్‌లోనే ఉన్నారు ఆలియా. ఆమె నటిగా కంటిన్యూ అవుతూనే చిల్డ్రన్ బ్రాండ్ కాస్ట్యూమ్స్ ఆన్లైన్ లో సేల్ చేస్తున్నారు. రీసెంట్గా తారక్ పిల్లలకు ఆలియా దుస్తులు పంపించారు. అభయ్, భార్గవ్ పేర్ల మీద రెండు బ్యాగ్‌లను పంపించారు. ఆ దుస్తులు చూసిన పిల్లలు తెగ సంబరపడిపోయారని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు తారక్. అంతే కాదు, తన పేరు మీద బ్యాగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. దీనికి ఆలియా కూడా సో స్వీట్ అంటూ స్పందించారు.
తారక్ పిల్లల కోసం దుస్తులు పంపిన ఆలియా అంటూ నెట్టింట బ్యాగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తారక్ పిల్లలకు బట్టలు పంపిన ఆలియా, రామ్‌చరణ్‌కి కూతురో, కొడుకో పుడితే నేరుగా వచ్చి చూసేస్తారేమో అంటూ చెర్రీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇంతకీ ఆలియా కూతురు రహాకి ఎన్టీఆర్ ఏమైనా పంపారా? ఒకవేళ పంపక పోతే, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా ఏమైనా పంపిస్తారా? అంటూ ఆలియా గురించి ఆలోచిస్తున్నవారూ లేకపోలేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
