Home

»

Latest News

విశిష్ట శైలితో యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖ

Apr 18, 2011 1:54PM

ntr wall papers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures

 విశిష్ట శైలితో యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖ ఉంది. వివరాల్లోకి వెళితే యువ హీరో జూనియర్ యన్ టి ఆర్ మ్యారేజ్ నార్నే శ్రీనివాసరావు కుమార్తె కుమారి లక్ష్మీ ప్రణీతతో "మే" నెల 5 వ తేదీ తెల్లవారు ఝామున 2 గంటల 14 నిమిషాలకు (తెల్లవారితే శుక్రవారం), హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతుంది. ఈ వివాహానికి సంబంధించిన శుభలేక సాంప్రదాయ బద్ధంగా, పూర్వీకులను గౌరవించే శైలితో ఉండటం విశేషం.

ntr wall papers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures

ఈ శుభలేఖ మొత్తం ఆరు పేజీలుంది. తొలి పేజీలో పెద్ద యన్ టి ఆర్ గారి తాతగారైన నందమూరి పెదరామస్వామి ఫొటో ముద్రించబడి ఉంటే రెండవ పేజీలో పెద్ద యన్ టి ఆర్ తలిదండ్రుల ఫొటో, ఆ తర్వాత యన్ టి ఆర్, బసవరామ తారకం ల ఫొటో ముద్రించబడి ఉండగా, నాలుగవ పేజీలో "విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం" అంటూ యన్ టి ఆర్ కొడుకులూ,కోడళ్ళూ, కూతుర్లూ, అల్లుళ్ళ పేర్లు ముద్రించబడి ఉన్నాయి. అయిదవ పేజీలో పెళ్ళి ముహూర్తం విశేఆషాలు ముద్రించబడి ఉన్నాయి.

ntr wall papers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures

 ఈ శుభలేఖలో ఎక్కడా పెళ్ళి కొడుకు యన్ టి ఆర్ ఫొటో గానీ, పెళ్ళి కూతురు ఫొటో గానీ లేక పోవటం విశేషం. ఈ శుభలేఖతో పాటు కార్ పాస్ మరియూ పార్కింగ్ గురించిన వివరాలున్నాయి. మొత్తానికి తన కుటుంబం అన్నా, ఆ కుటుంబంలోని పెద్దలన్నా తనకున్న గౌరవమర్యాదలను జూనియర్ యన్ టి ఆర్ ఇలా ప్రదర్శించటం అతని అభిమానులందరికీ ఆనందం కలిగించింది.

ntr wall papers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures

ఈ యన్ టి ఆర్ పెళ్ళికి అనేకమంది ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఆహ్వానితుల్లో ఉంటారు గనుక చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నారట. ఇక నందమూరి అభిమానులు, యువరత్న నందమూరి బాలకృష్ణ అభిమానులు జూనియర్ యన్ టి ఆర్ అభిమానుల సంగతి చెప్పక్కర్లేదు కదా.

I

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com