Home

»

Latest News

యన్ టి ఆర్ ఊసరవెల్లి పోస్టర్

Apr 18, 2011 7:27PM

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" పోస్టర్ బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "ఊసరవెళ్ళి". ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" చిత్రం ఇప్పటికే 32 రోజుల తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఏప్రెల్ 16 వ తేదీ నుండీ రెండవ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" చిత్రంలో 'కిక్' శ్యాం కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures

ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" పేరు వింటేనే ఈ చిత్రంలో హీరో యన్ టి ఆర్ పాత్ర ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. ఊసరవెల్లి అంటే అవసరాన్ని బట్టి రంగులు మార్చేది అని అర్థం. తొండ ముదిరితే ఊసరవెల్లిగా మారుతుందంటారు. ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" చిత్రంలో యన్.టి.ఆర్. పాత్ర ఎన్ని రంగులు మార్చుతుందో ఆగస్టు నెలలో ఈ చిత్రం విడుదలయ్యాక కానీ మనకు తెలియదు.

 

గతంలో యన్.టి.ఆర్. , సురేంద్ర రెడ్డిల కాంబినేషన్ లో "అశోక్" అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఫరవాలేదనిపించే స్థాయిలో ఆడింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి". అదీగాక ఇటీవల విడుదలైన యన్.టి.ఆర్., ఇలియానా జంటగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన "శక్తి" చిత్రం ఫ్లాపవటంతో ప్రస్తుతం ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రం మీద యన్ టి ఆర్ చాలా ఆశలు పెట్టుకున్నారు.ఈ "ఊసరవెల్లి" చిత్రంతో పాటు బోయపాటి దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా, క్రియెటీవ్ కమర్షియల్స్  పతాకంపై, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రంలో కూడా యన్ టి ఆర్ నటిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com