ఎన్టీఆర్ ' జనతా గ్యారేజ్ ' రేపే తెరుస్తున్నాడు
on Feb 21, 2016
నాన్నకు ప్రేమతో హిట్ తో మంచి జోష్ లో ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా జనతా గ్యారేజ్. మిర్చి,శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లతో, టాప్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్న కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. టైటిల్ తో నుంచి, సెట్ వేయడం వరకూ, ప్రతీ దాని మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు. సారథి స్టూడియోస్ లో వేసిన జనతా గ్యారేజ్ సెట్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయిన సంగతి తెలిసిందే.
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో సూపర్ క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ సినిమాకు కేరళలో కూడా ప్రత్యేక మార్కెట్ క్రియేట్ అయింది. రేపటి నుంచే ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ తో జనతా గ్యారేజ్ మొదలవబోతోంది. ఆ తర్వాత సారథి స్టూడియోస్ లో గ్యారేజ్ సెట్ కు షూటింగ్ షిప్ట్ అవుతుంది. ఆగష్ట్ 12న జనతాగ్యారేజ్ థియేటర్లలోకి రాబోతోందని సమాచారం. శ్రీమంతుడు తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ జనతా గ్యారేజ్ ను నిర్మిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
