దేవర-2.. క్లారిటీ ఇచ్చేసిన ఎన్టీఆర్!
on Dec 2, 2025

దేవర-2 ఉందా లేదా?
క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్!
కొరటాల ఏం చేయనున్నాడు?
దేవర(Devara) సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. దేవర పార్ట్-2 ఉంటుందా లేదా? అనే చర్చ కొద్ది నెలలుగా జరుగుతోంది. మొదట్లో 'దేవర-2'పై అనుమానాలు వ్యక్తమవ్వగా.. ఖచ్చితంగా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చెప్పాడు. దీంతో ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే కొద్దిరోజులుగా 'దేవర-2'(Devara 2) పూర్తిగా ఆగిపోయిందనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. మరి దేవర-2 నిజంగానే ఆగిపోయిందా? ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం ఏంటి?
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'దేవర'. పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో 2024, సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టి.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా రూ.450 కోట్ల గ్రాస్ రాబట్టి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'దేవర' కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో 'దేవర-2' ఉండకపోవచ్చని మెజారిటీ అభిమానులు కూడా భావించారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం దేవర స్క్రిప్ట్ ని, కొరటాలను నమ్మాడు. అందుకే దేవర-2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అయితే తన ఇతర కమిట్ మెంట్స్ కారణంగా.. దేవర-2 కి డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు.
Also Read: 'అఖండ-2'లో శివుడిగా ఎన్టీఆర్!
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది అనుకున్న దానికంటే బాగా ఆలస్యమవుతోంది. ఆ తరువాత త్రివిక్రమ్, నెల్సన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. దీంతో ప్రస్తుతానికి దేవర-2 కి బ్రేక్ ఇవ్వాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని కొరటాలకు కూడా చెప్పాడట. తన కమిట్ మెంట్స్ పూర్తవ్వడానికి టైం పడుతుంది, ఈలోపు వేరే ప్రాజెక్ట్ చేసుకోమని ఎన్టీఆర్ చెప్పినట్లు వినికిడి. ఎన్టీఆర్ నుండి క్లారిటీ రావడంతో.. ప్రస్తుతం కొరటాల, మరో స్క్రిప్ట్ తో వేరే హీరో ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం.. ఎన్టీఆర్ ఇప్పటికీ దేవర-2 చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే దేవర-2 కు బ్రేక్ మాత్రమే ఇచ్చి, ఈ గ్యాప్ లో కొరటాలను వేరే ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పినట్లు సమాచారం.
మరి ఈ గ్యాప్ తరువాత దేవర-2 ఉంటుందా? ఉంటే ఎప్పుడు? అనేది ఎన్టీఆర్ కే తెలియాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



