Home

»

Latest News

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్: ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో ఎందుకీ భయం.?

Oct 8, 2026 6:17PM

ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారన్న వార్త వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. పైగా ఈసారి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. కార్తికేయ స్వామి కథతో అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కనుంది.

ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అసలు సమస్య షూటింగ్ కాదు.. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనే చర్చ మొదలైంది. దీనికి కారణం త్రివిక్రమ్ తాజా ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’ను గుర్తు చేసుకుంటున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి సాధారణ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కూడా చివరి దశలో మార్పులు, వాయిదాలు చోటుచేసుకుంటే.. భారీ మైథలాజికల్ సినిమాను త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తారన్న ప్రశ్న సోషల్ మీడియాలో మొదలైంది. 

ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఉన్న టెన్షన్ అంతా ‘సినిమా ఎలా ఉంటుంది?’ అన్న దానికంటే.. ‘ఇంత భారీ సినిమాను త్రివిక్రమ్ ఎంత పక్కాగా ప్లాన్ చేస్తారు?’ అన్నదే.

మరి ‘ఆదర్శ కుటుంబం’ తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం ఆయన తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: గరివిడి లక్ష్మి ఎవరు.. బయోపిక్ తీసే అంతలా ఆమె ఏం చేసింది.?

 

 

 

[NTR Fans Worry About God of War, Jr NTR Fans, God Of War Movie, Trivikram Srinivas, Aadarsha Kutumbam Movie, Victory Venkatesh, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com