
టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్స్ ఇప్పుడు ఒకే తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపు ఒకేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.
ఇద్దరూ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. పైగా ఈ రెండు సినిమాలూ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా రెండు భాగాల చిత్రీకరణను పూర్తి చేసి, పెద్ద గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ఇద్దరి ప్లాన్‌గా చెబుతున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. మొదట ఈ సినిమా ఒకే భాగంగా తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కథ, స్కేల్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు టాక్.
ఇక ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కూడా రెండు భాగాలుగా రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా భారీ షెడ్యూల్స్‌తో కొనసాగుతోంది.

సాధారణంగా ఒక సినిమా రెండు భాగాలుగా వస్తే.. మొదటి భాగం విడుదలైన తర్వాత రెండో భాగం కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల విషయంలో మాత్రం అలా కాకుండా.. ‘ధురంధర్’ తరహాలో రెండు భాగాలను వీలైనంత తక్కువ గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అందుకే ఇద్దరూ ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువగా తమ ప్రస్తుత సినిమాల షూటింగ్స్‌కు కేటాయిస్తున్నారని టాక్. ఈ రెండు భాగాల షూటింగ్ పూర్తయిన తర్వాతే కొత్త సినిమాల వైపు వెళ్లాలని ఇద్దరూ భావిస్తున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో ఎందుకీ భయం.!
[NTR Allu Arjun Same Strategy, Raaka Movie, Dragon Movie, Allu Arjun, Jr NTR, Prashanth Neel, Atlee, Telugu Film News]





