Home

»

Latest News

రెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా

Mar 28, 2011 5:05PM

mahesh babu wallpapers, mahesh babu stills, mahesh babu images, mahesh babu pics, mahesh babu photos, mahesh babu picturesరెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా తీయనున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్న చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. తమిళంలో వ్రాయబడిన "పొన్నియన్ సెల్వన్" అనే చారిత్రాత్మక నవలకు దృశ్యరూపంగా ఈ చిత్రం నిర్మించబడుతోంది.ఈ చిత్రంలో మహేష్ బాబు చోళరాజుగా నటిస్తూండగా, మరో హీరో విక్రమ్ పల్లవరాజుగా నటిస్తూండగా, విజయ్, ఆర్య, అనుష్క ముఖ్యపాత్రల్లో నటిస్తూండగా మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ చిత్రానికి మొత్తం రెండు వందల కోట్ల అత్యంత భారీ బడ్జెట్ ఖర్చుచేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తూండగా, మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో అక్కడే రెండవ భాగం మొదలవుతుందట. ఈ చిత్రం మొదటి భాగానికి వంద కోట్లు, రెండవ భాగానికి వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి గాను మహేష్ బాబు పన్నెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com