పుట్టినరోజున ఎన్టీఆర్ చిక్కడు దొరకడు..!
on May 18, 2016

మే నెలలో నందమూరి అభిమానులకు డబుల్ బొనాంజా. ఎందుకంటే ఇదే నెలలో తమ అభిమాన అన్నగారి జయంతి, ఆయన పోలికలతో పుట్టిన చిన్న తారకరాముడి పుట్టినరోజు వస్తాయి. మే 28న పెద్ద ఎన్టీఆర్ జయంతి. మే 20 న జూ ఎన్టీఆర్ బర్త్ డే. ప్రతీ ఏడాదీ ఈ రెండు రోజుల్నీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్. అయితే, జూనియర్ మాత్రం ఎప్పుడూ బర్త్ డే కి హడావిడి చేసింది లేదు. కేవలం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యే తప్ప, బయటకు ప్రదర్శనగా పుట్టినరోజు జరుపుకున్న సందర్భాలు లేవు. మరి ఈసారి పుట్టినరోజుకు ఏం చేస్తున్నాడో తెలుసా..ఏకంగా సిటీకి దూరంగా, కేవలం ఫ్యామిలీకే టైం కేటాయించబోతున్నాడు. అమ్మ షాలిని, భార్యా పిల్లలతో కలిసి వెకేషన్ ప్లాన్ చేశాడట. నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ లకు వరసగా గ్యాప్ లేకుండా కష్టపడిన తారక్, పుట్టినరోజుకు కేవలం కుటుంబంతో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో ఆయన్ను కలిసి విషెస్ చెప్పి, సెలబ్రేట్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ అందరికీ ఇది బ్యాడ్ న్యూసే అయినా దిగులు పడకుండా ఆయన పేరు మీద ఛారిటీ కార్యక్రమాలు చేయబోతున్నారట. అయితే ముందుగానే జనతా గ్యారేజ్ లుక్ ను రిలీజ్ చేసి వాళ్లకు బహుమతి ఇచ్చే ఊరెళ్తున్నాడు ఎన్టీఆర్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



