ఎన్టీఆర్ బయోపిక్..హీరోగా బాలకృష్ణ
on Feb 6, 2017

ప్రజంట్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని పరిశ్రమలు బయోపిక్‌లపై ఫోకస్ చేశాయి..ఇప్పటికే ఎందరో ప్రముఖుల జీవిత చరిత్రల్ని సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించారు దర్శకులు. అయితే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి..పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేపట్టి చరిత్రను తిరగరాసిన విశ్వవిఖ్యాతనట సార్వభౌమ, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని కూడా తెరకెక్కించాలని ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఎవరు దానిని పట్టాలెక్కించలేకపోయారు. కానీ ఈ కలను ఇప్పుడు నిజం చేయబోతున్నారు ఆయన తనయుడు హీరో బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై త్వరలో సినిమా తీస్తానని..అన్నగారి పాత్రలో తానే నటిస్తానని బాలయ్య ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని..అతి త్వరలోనే సినిమాకు దర్శకుడు, నిర్మాతలను ప్రకటిస్తానని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



