ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మైథలాజికల్ ఫిల్మ్!
on Feb 15, 2023

జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి అసలు ఎన్టీఆర్ తన 30వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. అయితే త్వరలో వీరి కాంబినేషన్ లో ఓ భారీ పౌరాణిక చిత్రం రానుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ చెప్పడం విశేషం.
'ఆర్ఆర్ఆర్'కి ముందు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా వచ్చి ఘన విజయం సాధించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా వీరి కలయికలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ పట్టాలెక్కలేదు. దీంతో ఫ్యాన్స్ కొంత ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే వీరి కాంబోలో భారీ మైథలాజికల్ ఫిల్మ్ రానుందని చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపారు నాగవంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో రావాల్సిన రెండో సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు. అయితే వారి కలయికలో ఓ భారీ పౌరాణిక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ గారి, త్రివిక్రమ్ గారి కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ ఉంటుందని, రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగవంశీ చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ ఇంతవరకు పౌరాణిక చిత్రం చేయనప్పటికీ ఆయనకు పురాణాల మీద ఎంత పట్టుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఏ పాత్రయినా చేసి మెప్పించలేదు. ఈ తరంలో పౌరాణిక పాత్రలు చేసి మెప్పించగల అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. అలాంటిది ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి మైథలాజికల్ ఫిల్మ్ చేస్తే అంచనాలు ఆకాశాన్నంటుతాయనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



