ఎన్టీఆర్ డాన్స్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా కీలక నిర్ణయం!
on Jun 30, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth)జోడి కట్టబోతుందని సమాచారం. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ జూన్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్ నుంచి వస్తున్న 31 వ చిత్రం కాగా 'డ్రాగన్'(Dragon)అనే పేరు పరిశీలనలో ఉంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యేక గీతాలకి ఉండే క్రేజే వేరు. సదరు గీతాల్లో ఎన్టీఆర్ వేసే స్టెప్ లు అభిమానులతో పాటు ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తాయి. దీంతో మూవీ తాలూకు హిట్ రేంజ్ పెరగడంతో పాటు, రిపీట్ ఆడియెన్స్ ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి శక్తీ ఎన్టీఆర్ డాన్స్ కి ఉంది. ఈ కారణంతోనే ప్రశాంత్ నీల్ తన చిత్రంలో ప్రత్యేక గీతాన్ని డిజైన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తెరకెక్కించిన కేజిఎఫ్ సిరీస్, సలార్ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు లేవు. కానీ ఎన్టీఆర్ డాన్స్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా స్పెషల్ సాంగ్ ఫిక్స్ చేస్తునట్టుగా తెలుస్తుంది.
ఎన్టీఆర్ గత చిత్రాలైన ఆర్ఆర్ఆర్, దేవర లో కూడా కథకి ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా ప్రత్యేక గీతాలకి చోటు లేకుండా పోయింది. అప్ కమింగ్ మూవీ 'వార్ 2'(War 2)లో కూడా స్పెషల్ సాంగ్ ఉండే అవకాశం లేదు. దీంతో ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ వేసే ఊర మాస్ స్టెప్స్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ ఇప్పట్నుంచే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో రష్మిక(Rashmika Mandanna)కేతిక శర్మ(Ketika Sharma)కనిపించనున్నారనే రూమర్స్ కూడా వస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
