సోలో హీరోగా నోయెల్ ఎంట్రీ!
on Jun 9, 2021

సింగర్ గా, ర్యాపర్ గా, నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నోయల్ షాన్. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఇతడు బిగ్ బాస్ షో ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. దీంతో అతడికి సోషల్ మీడియాలో క్రేజ్ బాగా పెరిగింది. రెండురోజుల క్రితం నోయల్.. "ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పబోతున్నా" అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరేమో "రెండో పెళ్లి చేసుకుంటున్నావా..?" అంటూ ప్రశ్నించారు.
అయితే తాజాగా నోయెల్ అసలు విషయం చెప్పాడు. తను హీరోగా రాబోతున్న కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. దీంతో నోయల్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. హీరోగా వెండితెరపై తనను తాను చూసుకోవాలనే నోయెల్ చాలా కాలంగా అనుకుంటున్నాడు. కానీ ఇప్పటివరకు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించాడు. ఇన్నాళ్లకు నోయల్ కు సోలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది.
'మనీషి' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నోయల్. ఇందులో పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. స్పార్క్ ఓటీటీలో ఈ నెల 18 నుండి ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు. వినోద్ నాగుల అనే యువకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



