'అఖండ' రిలీజ్ డేట్ కి కళ్యాణ్ రామ్ మూవీ!
on Oct 28, 2022

గతేడాది డిసెంబర్ 2న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది అదే తేదీకి మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం విడుదల కాబోతుందని తెలుస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో 'బింబిసార'తో ఘన విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసి, కంటెంట్ మీద నమ్మకంతో విడుదలకి కొద్దిరోజుల ముందు బాగా ప్రమోట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన తదుపరి సినిమాకి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఈ నందమూరి హీరో.
కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 19వ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఎమిగోస్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుందని ఇటీవల ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. గతేడాది నందమూరి కుటుంబానికి 'అఖండ' రూపంలో బ్లాక్ బస్టర్ అందించిన డిసెంబర్ 2, ఈ ఏడాది అదే రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



