విజయ్‌తో ఉన్న బాలనటిని గుర్తుపట్టారా? ఇవాళ ఆమె క్రేజీ హీరోయిన్!
on Sep 17, 2020
'వెరుతే ఒరు భార్య' (కేవలం ఒక భార్య) అనే మలయాళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, అందులో చేసిన పాత్రతో ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న తార నివేదా థామస్ అని మనలో చాలా మందికి తెలీదు. తెలుగులో బాలనటిగా కనిపించలేదు కానీ తమిళంలోనూ ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. విజయ్ హీరోగా నటించిన 'కురువి' మూవీలో అతని చెల్లెలి పాత్రలో ఆకట్టుకుంది నివేదా. పై ఫొటో ఆ సినిమాలోదే.
తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేంజికి రాకపోయినా, భిన్న కాన్సెప్టులతో రూపొందుతున్న చిత్రాలలో నటిస్తూ, తన ప్రెజెన్స్‌తో ఆ సినిమాలకు ఆకర్షణను తీసుకొస్తోంది నివేదా. చివరగా ఆమె ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన 'వి' మూవీలో సుధీర్‌బాబు జోడీగా కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ నవలను రాసే రచయిత్రిగా కనిపించి, ఇదివరకెన్నడూ చేయని హుషారైన పాత్రలో తన ముద్రను వేసింది.
అందులో 'బేబీ టచ్ మీ నౌ సాంగ్' ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ అలాంటి హుషారైన సాంగ్‌లో అలా డాన్స్ చేయలేదు నివేదా. "ఆ సాంగ్‌ను మేం చాలా సరదాగా చేశాం. అప్పటికి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కొరియోగ్రాఫర్ గొప్పగా డాన్స్ కంపోజ్ చేశారు. ఇంతదాకా నేను చేసిన సినిమాల్లో ఎందులోనూ అలా డాన్స్ చేయలేదు. ఆ డాన్స్, ఆ సాంగ్, ఆ అట్మాస్ఫియర్‌ను నిజంగా ఎంజాయ్ చేశాను" అని చెప్పింది నివేదా.
ప్రస్తుతం 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్‌తో ఆమె నటిస్తోంది. ఒరిజినల్ హిందీ ఫిల్మ్ 'పింక్'లో తాప్సీ చేసిన పాత్రను చేస్తోంది నివేదా.
Also Read