పెళ్లి హడావిడిలో నితిన్ డబ్బింగ్ చెబితే?
on Jul 26, 2020

నితిన్ బ్యాచిలర్ జీవితానికి మరికొన్ని గంటల్లో ఎండ్ కార్డు పడిపోతుంది. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న షాలినితో ఆదివారం రాత్రి 8.30 గంటలకు అతడి పెళ్లి. ఆల్రెడీ అతడిని పెళ్లి కొడుకుని చేశారు. నితిన్ ఇంటిలో పెళ్లి సందడి మొదలైంది. ఇంత పెళ్లి హడావిడిలో అతడు డబ్బింగ్ చెబుతాడా? చెప్పడానికి టైమ్ ఉందా? అన్నది క్వశ్చన్. ఒకవేళ చెప్పగలిగితే... చెబితే మాత్రం ప్రేక్షకుల ముందు నితిన్ కొత్త సినిమా టీజర్ వస్తుంది.
ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలలో 'రంగ్ దే' ఒకటి. 'భీష్మ' విజయం తరవాత సితార ఎంటెర్టైనెంట్స్‌లో అతడు నటిస్తున్న సినిమా. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' తరవాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా. నితిన్ పెళ్లి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, నితిన్ డబ్బింగ్ చెబితేనే ఆ టీజర్ రిలీజ్ చేయడం సాధ్యం అవుతుంది. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే ఈ రోజు లేదా ఆదివారం టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



