నితిన్ వర్సెస్ రష్మిక!
on Jan 23, 2021

గత ఏడాది మహాశివరాత్రి స్పెషల్ గా ఫిబ్రవరి 21న విడుదలైన భీష్మ చిత్రంలో జంటగా కనువిందు చేశారు నితిన్, రష్మిక మందన్న. ఆ సినిమాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించి.. క్యూటెస్ట్ హిట్ ని తమ కాంబో ఖాతాలో వేసుకున్నారు. కట్ చేస్తే.. ఏడాది తిరిగేసరికి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోరుకి సిద్ధమయ్యారు.
ఆ వివరాల్లోకి వెళితే.. భీష్మ తరువాత నితిన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్.. చెక్. వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 19న రాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని నితిన్ అండ్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఇక రష్మిక సంగతి తీసుకుంటే.. భీష్మ తరువాత ఆమె నుంచి వస్తున్న పొగరు చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో అదే ఫిబ్రవరి 19న థియేటర్స్ లో సందడి చేయనుంది.
మొత్తమ్మీద.. గత ఏడాది ఫిబ్రవరికి భీష్మ లో కలసి నటించి కనువిందు చేసిన నితిన్, రష్మిక.. సరిగ్గా సంవత్సరం తరువాత అదే ఫిబ్రవరిలో ఒకే రోజున పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారన్నమాట. మరి.. ఈ ఇద్దరిలో ఎవరిని సక్సెస్ వరిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



