యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తుండగా.. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ సినిమాలో రుక్మిణి ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం చిత్ర బృందం ఇంకా సమాధానం చెప్పలేదు. అక్టోబర్ 13న రుక్మిణి గురించి కీలక వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌ను మరింత పెంచారు. దీంతో నితిన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటివరకు కథానాయిక వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ కూడా వినూత్నంగా ఉంది. దర్శకుడు మురళీ కాంత్ ఈ సినిమా కథను నానికి వివరిస్తున్నట్లు వీడియో మొదలవుతుంది. ఇది కృష్ణుడి కథ అని దర్శకుడు చెప్పడంతో నాని ఆసక్తిగా వింటారు. అయితే అక్కడ కనిపించే పుస్తకాలన్నీ రుక్మిణి రాసినవని తెలిసి.. ‘ఈ రుక్మిణి ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. అప్పటివరకు నిద్రపోతున్న నితిన్ మేల్కొని ‘రుక్మిణి నా భార్య’ అని చెప్పడంతో గ్లింప్స్ ముగుస్తుంది. ఈ చిన్న సన్నివేశంతోనే సినిమా కథపై ఆసక్తి పెంచారు.
ఇక ఈ చిత్రంలో సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తోనే ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా.. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 13న రుక్మిణి పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వస్తే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.
[Nithiin Alias Rukmini, Alias Rukmini Release Date, Nithiin New Movie, Nani Presents Alias Rukmini, Murali Kanth Devasoth, Alias Rukmini Heroine, Nithiin Movies, Vijai Bulganin, Telugu Movie Updates, Alias Rukmini December 4]






