Home

»

Latest News

రణబాలి ట్రైలర్ లాంచ్‌లో రష్మిక మిస్సింగ్: ఆమె రాకపోవడానికి అసలు కారణమేంటి.? 

Oct 9, 2026 11:51AM

పెళ్ళి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘రణబాలి’. అక్టోబర్ 16న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమె ఎందుకు రాలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి.

అక్టోబర్ 8న హైదరాబాద్‌లో ‘రణబాలి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు రష్మిక కూడా వస్తుందని ముందుగా ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె కనిపించలేదు. 

దీంతో ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక ఎందుకు రాలేదంటూ ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 'రాకా' షూటింగ్ కారణంగానే రష్మిక ఈ ఈవెంట్ కి రాలేకపోయారని తెలుస్తోంది. 

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'రాకా' మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రష్మిక కూడా ఆ షూటింగ్ లో పాల్గొతున్నట్లు సమాచారం. అందుకే ‘రణబాలి’ వెంట్‌కు రాలేకపోయిందని అంటున్నారు.

ఈ విషయంపై విజయ్ కూడా స్పందించారు. రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. షూటింగ్స్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ట్రైలర్ లాంచ్ కు ఆమె రాలేకపోయినట్లు చెప్పారు. అంతేకాదు, నెక్స్ట్ జరిగే రణబాలి ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రష్మిక వస్తుందని విజయ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: తమిళ రాజకీయాల్లో ట్విస్ట్.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న లతా రజనీకాంత్.?

 

 

 

[Ranabaali Trailer Launch Event, Rashmika Absent, Ranabaali Trailer, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com