టీజర్ రివ్యూ : కేశవ
on Mar 22, 2017

స్వామి రారా నుంచి నిఖిల్ ప్రయాణం పూర్తిగా మారిపోయింది. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య... ఇలా డిఫరెంట్ కథలు ఎంచుకొంటూ ఆకట్టుకొంటున్నాడు. ఇప్పుడు కేశవగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్వామి రారాతో నిఖిల్‌ని ఫామ్‌లోకి తీసుకొచ్చిన సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో కేశవపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు టీజర్ బయటకు వచ్చింది. భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.. వైప్లవ్య గీతాన్ని నేను.. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం.. అనల వేదిక ముందు అస్ర నైవేద్యం’ అంటూ శ్రీశ్రీని గుర్తు చేస్తూ టీజర్ మొదలైంది. ఇదో్ ప్రతీకార నేపథ్యంలో సాగే కథ అని టీజర్‌లోనే చెప్పేశారు.
నిఖిల్ తొలిసారి పూర్తిగా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. విజువల్ గా ఈ సినిమా కొత్తగా ఉంది. సన్నీ అందించిన ఆర్.ఆర్ మరింత వన్నె తీసుకొచ్చింది. రివైంజ్ కథే అయినా.. దీన్నో థ్రిల్లర్‌గా మలిచినట్టు కనిపిస్తోంది. అయితే టీజర్లో రక్తపాతం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కథలు నిఖిల్‌కి సూట్ అవుతాయా అనే అనుమానాలూ వస్తున్నాయి. కాకపోతే.. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచడంలో సఫలీకృతమైంది. ఈ వేసవికి రాబోతున్న కేశవ... నిఖిల్‌కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



