Home

»

Latest News

పేరు మారింది...ఫేట్ మారింది!!

May 1, 2019 5:12PM

 

వ‌రుస ఫ్లాపుల‌తో విసిగిపోయిన సాయిధ‌ర‌మ్ తేజ్... సాయితేజ్ గా పేరు మార్చుకుని `చిత్ర‌ల‌హ‌రి`లో న‌టించాడు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చ‌న ఈ చిత్రం మంచి వ‌సూళ్ల‌తో దూసుకెళ్తూ అటు విమ‌ర్శ‌కుల ఇటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లందుకుంటోంది. చిత్రల‌హ‌రి ఇచ్చిన ఉత్సాహంతో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాడ‌ట సాయితేజ్. ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ట్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. గ‌తంలో మారుతితో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం అందుతోంది.  డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను మారుతి త‌న దైన శైలిలో తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇంకా రెండు ప్రాజెక్ట్స్ కూడా సాయితేజ్ ఒప్పుకున్నాడ‌ని స‌మాచారం. మొత్తానికి పేరు మార‌డంతో సాయితేజ్ ఫేట్ మారిందంటున్నారు టాలీవుడ్ ప్ర‌ముఖులు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com