చరణ్‌కి, వరుణ్‌కి తేడా ఏంటంటే..?
on Mar 23, 2020
.jpg)
మెగా వారసులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ అతి తక్కువ కాలంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగులో రామ్‌చరణ్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేసినప్పటికీ... తర్వాత రూటు మార్చారు. 'గోవిందుడు అందరివాడేలే' అంటూ ఫ్యామిలీ సినిమా చేశారు. 'రంగస్థలం'లో వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా రామ్ చరణ్ నటించడం ప్రయోగమే. ఇక, వరుణ్ తేజ్ విషయానికి వస్తే... 'ముకుంద' నుండి 'గద్దలకొండ గణేష్' వరకు డిఫరెంట్ సినిమాలు చేశారు. నటన పరంగా ఇద్దరిదీ వేర్వేరు పంథా. మరి, చెల్లెలు విషయంలో అన్నగా ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు నిహారిక చెప్పారు.
"ఇద్దరూ సూపర్ ప్రొటెక్టివ్ బ్రదర్స్. నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే... ప్రేమను చూపించే విధానం వేర్వేరుగా ఉంటుంది" అని నిహారిక అన్నారు. తాను పుస్తకాలు చదవనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలో నిహారిక తమిళ సినిమాలో నటించబోతున్నారు. ఆల్రెడీ విజయ్ సేతుపతి సరసన ఒక తమిళ చేశారు. ఇది రెండోది అన్నమాట. 'నేను మీ బావ సాయి తేజ్ గురించి చాలాసార్లు అడిగాను' అని ఒకరు ప్రశ్నిస్తే... "మా బావ బంగారు" అని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



