ఎన్టీఆర్ పై బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్.. వీళ్ళకి ఇదేం పోయే కాలం!
on Oct 10, 2025

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(NTR)కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని అందించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్థాయిలో తన ఇమేజ్ ని మరింతగా పెంచుకున్నాడు. దీంతో 'వార్ 2'(war 2)నుంచి పిలుపు వచ్చింది. ఎన్టీఆర్ ఇమేజ్ తమకి మరింతగా ఉపయోగపడుతుందనే, మేకర్స్ ఎన్టీఆర్ ని ఒప్పించి వార్ 2 లో చేయించారు. ఈ విషయాన్ని చాలా ఫంక్షన్స్ లో 'వార్ 2' మేకర్స్ చెప్పడం జరిగింది.
కానీ రీసెంట్ గా బాలీవుడ్ కి చెందిన నటుడు, ఫిలిం క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్(Kamal R Khan)'ఎక్స్' వేదికగా వార్ 2 గురించి స్పందిస్తు ఒక్క ప్లాప్ చాలా విషయాలని మార్చగలదు. ఎన్టీఆర్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ తమ తదుపరి చిత్రాన్ని పక్కన పెట్టేసింది. హిందీ సినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ కెరీర్ ముగిసింది'. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ హృతిక్ రోషన్(Hrithik Roshan)తో 'క్రిష్ 4' సినిమా నిర్మించడానికి నిరాకరించడంతో పాటు, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(ayan mukerji)ని 'ధూమ్ 4' నుంచి తొలగించారు. హృతిక్ భవిష్యత్తులో యష్ రాజ్ టీంతో కలిసి పనిచేయడు. కియారా అద్వానీ(Kiara advani)కెరీర్ శాశ్వతంగా ముగిసిపోయిందంటు ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కమల్ రషీద్ ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు. అది ఒక బ్రాండ్. పంతొమ్మిదేళ్ళ వయసులోనే తెలుగుతో పాటు ఎంటైర్ సౌత్ చిత్ర పరిశ్రమకి చెందిన అన్ని రికార్డులని ఒక మూలన పడేసి అగ్ర హీరోగా అవతరించాడు. వార్ 2' అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయింది కానీ, బాక్సాఫీస్ దగ్గర 350 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇందుకు ఎన్టీఆర్ కూడా ఒక కారణం. ప్రశాంత్ నీల్ తో రాబోయే పాన్ ఇండియా చిత్రం నీకు సమాధానం చెప్తుంది. బాలీవుడ్ లో కూడా మళ్ళీ స్ట్రెయిట్ చిత్రంతో వస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



