యాక్షన్ యాంగిల్ చూపించాలని ఇస్మార్ట్ హీరోయిన్ కోరిక
on May 18, 2020

'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ ను దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా అందంగా చూపించారు. పాటల్లో అందాల నిధులను చూపిస్తూ నిధి హాట్ హాట్ గా కనిపించింది. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాల్లోనూ ఆమె అందంగా, ముద్దుగానే కనిపించింది. అయితే తనలో యాక్షన్ యాంగిల్ కూడా ఉందని నిధి అగర్వాల్ చెబుతోంది. యాక్షన్ సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరిక బయట పెట్టింది.
"హిందీలో టైగర్ ష్రాఫ్ సరసన కథానాయికగా తొలి సినిమా చేశా. ఆ సినిమా కోసం అతడితో పాటు నేను యాక్షన్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. నాలోని యాక్షన్ యాంగిల్ ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తున్నాను" అని తాజా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ తెలిపింది. అలాగే హిస్టారికల్ సినిమా కూడా చేయాలని ఉందని చెప్పింది. చారిత్రక నేపథ్యంలో వేసే సెట్లు, గెటప్పులు ఆమెకు ఇష్టమట. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



