నిధి అగర్వాల్ ని పెళ్లి చేసుకోబోతున్న అభిమాని! అయితే ఆ నెంబర్ కావాలి
on Jul 8, 2025

పవన్ కళ్యాణ్(pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu)ఈ నెల 24 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో 'పంచమి' అనే రాజనర్తకి క్యారక్టర్ లో ప్రముఖ హీరోయిన్ 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో వీరమల్లు లో నిధి పెర్ఫార్మెన్స్ తో కూడిన క్యారక్టర్ ని పోషిస్తుందనే విషయం అర్ధమవుతుంది. తనపై చిత్రీకరించిన సాంగ్స్ కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే 'నిధి'ని 'ఎక్స్' వేదికగా అభిమానులు కొన్ని ప్రశ్నలు అడగడటం జరిగింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ట్వీట్ చేస్తు 'మీ అమ్మ గారి ఫోన్ నెంబర్ ఇస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను. ప్లీజ్ నిధి నెంబర్ ఇవ్వు' అని ఒక హార్ట్ ఎమోజీ తో రిక్వెస్ట్ చేసాడు. 'అవునా చిలిపి' అంటూ నిధి సమాధానం ఇచ్చింది. దీంతో అభిమాని ప్రశ్నకి నిధి క్యూట్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే భయమేస్తుంది. పవన్ సార్ ముందు ఎలా మాట్లాడగలను, మీ సపోర్ట్ కావాలంటూ కూడా మరో అభిమాని వేసిన ప్రశ్నకి సమాధానంగా నిధి చెప్పుకొచ్చింది. ప్రభాస్(Prabhas)వన్ మాన్ షో 'దిరాజాసాబ్'(The Raja Saab)లో కూడా నిధి హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రెండు భారీ సినిమాల రిలీజ్ లతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ రెండు చిత్రాల రిలీజ్ తర్వాత నిధి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రాజాసాబ్ డిసెంబర్ 5 న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



