పూరితో బెగ్గర్ లేదని క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి
on May 22, 2025

మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(Vijay Sethupathi)పూరి జగన్నాధ్(Puri Jagannadh)కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికార ప్రకటన కూడా వచ్చింది. పూరి,ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఈ క్రేజీ కాంబోలో ఎలాంటి కథ తెరకెక్కబోతుందనే ఆసక్తి ఇద్దరి అభిమానులతో పాటు ప్రేక్షకులోను ఏర్పడింది.
రీసెంట్ గా విజయ్ సేతుపతి, ఈ నెల 23 న విడుదల కాబోతున్న తన అప్ కమింగ్ మూవీ' ACE'మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి విజయసేతుపతి తో మాట్లాడుతు పూరి గారితో చేస్తున్న'బెగ్గర్' మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడగడం జరిగింది. అప్పుడు విజయ్ సేతుపతి మాట్లాడుతు' జూన్ లో మూవీ స్టార్ట్ కావచ్చు. 'బెగ్గర్' అనే టైటిల్ మీరు ఫిక్స్ చేసారు. మేము చెయ్యలేదని చెప్పడం జరిగింది.
ACE 'మూవీ రొమాంటిక్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth)దివ్య పిళ్ళై(Divya Pillai)బబ్లూ పృథ్వీ రాజ్, యోగిబాబు, బిఎస్ అవినాష్, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 'ఆరుముగ కుమార్'(Arumuga Kumar)స్వీయ దర్శకతంలో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్ అయితే మూవీపై అంచనాలు పెంచిందని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



