గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి!
on May 6, 2025
మెగా కుటుంబం నుంచి శుభవార్త వచ్చింది. వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసిన వరుణ్.. జీవితంలో అత్యంత అందమైన బాధ్యతను తీసుకోబోతున్నామని రాసుకొచ్చాడు.
వరుణ్, లావణ్య వివాహం 2023 నవంబర్ లో జరిగింది. వీరు 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం, ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సందర్భంగా వరుణ్-లావణ్యకు సినీ ప్రముఖులు, సినీ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
