'ఐ డోంట్ కేర్' అంటున్న బాలయ్య!
on Jun 8, 2023
కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ని పెట్టారు. బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి ఘన విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.
'NBK 108' చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ఖరారు చేశారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే అదే టైటిల్ ని ప్రకటిస్తూ తాజాగా మూవీ టీం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. అదొక భారీ యాక్షన్ సన్నివేశంలోని స్టిల్ అని చూడగానే తెలుస్తోంది. జాతీయ చిహ్నం వచ్చేలా డిజైన్ చేసిన 'భగవంత్ కేసరి' టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. ఇక టైటిల్ కి 'ఐ డోంట్ కేర్' అనే ట్యాగ్ లైన్ జోడించడం చూస్తుంటే బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అర్థమవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల కానుంది.
బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) సందర్భంగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ సందడి మొదలైంది. ఈరోజు 'NBK 108' టైటిల్ ని రివీల్ చేశారు. జూన్ 10న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే బాలయ్య తదుపరి చిత్రం 'NBK 109' ప్రకటన కూడా రానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
