రేపే 'NBK 108' లాంచ్
on Dec 7, 2022

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న 'వీర సింహా రెడ్డి' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నాడు బాలయ్య. ఆయన కెరీర్ లో 108వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు.

బాలయ్య-అనిల్ కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ ఆగస్టులో ప్రకటించింది. అప్పటి నుంచే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఈ మూవీ లాంచ్ కి ముహూర్తం కుదిరింది. రేపు(డిసెంబర్ 8) ఉదయం 9:36 కి పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ హాజరు కానున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



