Home

»

Latest News

శాతకర్ణికి హాలీవుడ్ నటుడి సహకారం..

Jul 8, 2016 12:09PM

విలక్షణ దర్శకుడు "క్రిష్" దర్శకత్వంలో, నందమూరి నటసింహం బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి " షూటింగ్‌లో సూపర్‌స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త బయటకు వస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. తాజాగా మరో వార్త ఫిలింనగర్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఆసక్తిని రేకిత్తిస్తోంది. అదేంటంటే ప్రముఖ హాలీవుడ్ నటుడు "నాథన్ జోన్స్" ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడన్న ప్రచారం జరగడం.

చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథ కావడంతో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో శాతకర్ణి, ఓ గ్రీకు రాజుతో తలపడాల్సి వస్తుందట. ఆ పాత్ర కోసమే నాథన్ జోన్స్‌ను సంప్రదించగా ఆయన కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో ట్రాయ్, మ్యాడ్‌మ్యాక్స్ లాంటి బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ సినిమాల్లో నాథన్ నటించారు. అయితే క్రిష్ టీమ్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com