Home

»

Latest News

శాండిల్‌వుడ్‌లోకి ఆది..తండ్రే స్పూర్తి..?

Jul 8, 2016 11:47AM

డైలాగ్‌కింగ్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, విలక్షణ నటుడిగా తెలుగునాట పేరు తెచ్చుకున్నారు సాయికుమార్. ఇక్కడ బిజీగా ఉన్న సమయంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ అగ్రకథానాయకుడిగా పేరుపొందాడు. అలా ఏకకాలంలో టాలీవుడ్, శాండీల్‌వుడ్‌లను షేక్ చేశాడు. సాయి నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. ప్రేమకావాలి, లవ్‌లీ తదితర సినిమాలతో నటుడిగా పరవాలేదనిపించుకున్నాడు. ఆ తరువాత విజయాల వేటలో వెనుకబడ్డాడు.

ప్రజంట్ చుట్టాలబ్బాయి సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇదిలావుండగా త్వరలో ఆది కూడా కన్నడ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు ఫిల్మ్‌నగర్లో షికారు చేస్తున్నాయి. అక్కడ తన తొలి చిత్రంగా నిఖిల్ హిట్ మూవీ కార్తికేయ కన్నడ రీమేక్‌లో నటించనున్నాడు. సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో పాటు నిఖిల్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాతో శాండీల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇప్పించి కొడుక్కి మంచి ఫ్లాట్‌ఫామ్ నిర్మించాలని సాయి కుమార్ భావిస్తున్నాడట. అయితే ఈ వార్త ఎంతవరకూ నిజమనేది తెలియాలంటే కొంతకాలం వెయిల్ చేయాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com