
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార. రెండు సార్లు ప్రేమలో విఫలమై, సినిమాలకు దూరమై తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్స్ చేసిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ్, మళయాళం ఇలా ఏ భాషలో చూసినా నయన్ మోస్ట్ వాంటేడ్. ఇటీవల ఈ అమ్మడికి తమిళ యువ దర్శకుడితో పెళ్లియిపోయిందని రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని నయనతార కొట్టిపారేసింది.
వెంకటేశ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమాలో నయన్ నటిస్తోంది. ఈ సినిమా యూనిట్‌తో నయన్ దిగిన ఫోటో ఆమె పెళ్లి విషయంలో మళ్లీ వార్తలు సృష్టించింది. పాటల షూటింగ్ కోసం ఫారిన్‌లో ఉన్న నయన్.. వెంకటేశ్, డైరెక్టర్ మారుతి, నిర్మాత నాగవంశీలతో ఫోటోలు దిగింది. కుర్చీలలో కూర్చున్న ఈ నలుగురిని వెనుకనుంచి తీసినట్టుగా ఉన్న ఫోటోలో నాగవంశీ చైర్ మీద ప్రొడ్యూసర్ అని, మారుతి చైర్ మీద డైరెక్టర్ అని, వెంకీ చైర్ మీద మిస్టర్ వెంకటేశ్ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అయితే నయన్ కూర్చున్న చైర్ మీద మిసెస్ కురియన్ అని రాసి ఉంది. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్, అయితే సినిమాల్లోకి అడుగుపెట్టిన తరువాత తన పేరును నయనతారగా మార్చుకుంది.
ఈ విషయం అందరికి తెలుసు..కాని దాని మీద కాదు ఆ పేరుకు ముందు మిసెస్ అని రాయడం. ఇప్పటి వరకు నయన్‌కు పెళ్లి కాలేదు మరి ఆమె పేరుకు ముందు మిసెస్ ఉండటంపై అభిమానులు షాక్ అవుతున్నారు. నిజంగా నయన్ పెళ్లి చేసుకుందా..? లేక ఈ సినిమాలో వెంకీ, నయన్‌లు తమ సొంత పేర్లతో కనిపిస్తున్నారా..అనేది తెలియాల్సి ఉంది. కాని ఈ ఫోటో చూసిన అభిమానుల గుండెల్లో మాత్రం నయన్ బాంబు పేల్చింది.






