
విలక్షణ నటుడు కమల్ హాసన్, క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ కాంభినేషన్‌లో తెరకెక్కిన సినిమా భారతీయుడు. లంచం, అవినీతి, అన్యాయాలపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు పోరాటం చేసే నేపథ్యంలో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో "మర్మకళ" పేరుతో చేసిన ఫైట్స్, కమల్ మేకప్, శంకర్ టేకింగ్ హైలెట్‌గా నిలిచాయి.
ఇప్పుడు ఈ మూవీకి త్వరలో సీక్వెల్ రాబోతుందంటూ కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ సినిమాను నిర్మించిన సూర్య మూవీస్ ఇన్నేళ్ల తరువాత సీక్వెల్ నిర్మించే ఆలోచన చేస్తోంది . పైగా ఈ సినిమా ఎండ్‌లో "మళ్లీ నా దేశానికి నా అవసరం ఉన్నపుడు మళ్లీ తప్పకుండా వస్తా" అంటూ డైలాగ్‌తో శుభం కార్డు పడుతుంది. దీంతో ఎప్పటికైనా సీక్వెల్ తీసే ఆలోచన అప్పుడే ఉన్నట్లుంది. దీనిపై ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ శంకర్ నాకు అత్యంత సన్నిహితుడు. ఇటీవల మేమిద్దరం కలిసినపుడు భారతీయుడు-2 గురించి చర్చ వచ్చింది. ఎలా చేయాలో ఇద్దరం ఆలోచించుకున్నాం. అంటూ ఆయన మీడియాతో మాట్లాడేసరికి ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అన్ని అనుకున్నట్లే జరిగితే రోబో-2 తర్వాత శంకర్ తీసే సినిమా ఇదే కావొచ్చు.






