.jpg)
పైన ఫొటోలో ఉన్న అందాల హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? బొమ్మలో ఇంత అందంగా ఉన్న ఈ హీరోయిన్.. రియల్ గా కూడా అంతే అందంగా ఉంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? ఎవరో కాదు ఒకప్పుడు తమ గ్లామర్ తో చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి కష్బూ. ఇటీవల ఆమె తన పుట్టినరోజును జరుపుకొన్ననేపథ్యంలో ఓ అభిమాని ఈ బొమ్మలు తయారు చేసి గిఫ్ట్ గా పంపించాడు. ఇక ఈ గిఫ్ట్ ను చూసిన కుష్బూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది. అంతేకాదు ఈ బొమ్మలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ... ‘ఎంత అందమైన ఆలోచన.. ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. అమేజింగ్ బర్త్‌డే గిఫ్ట్..’ అని ధన్యవాదాలు తెలిపారు. నిజంగానే..రియల్ గా కుష్బూ ఎంత బావుంటుందో.. బొమ్మలో కూడా అంత కంటే ఎక్కవ బాగుంది కదా.. కాగా ఖుష్బు ప్రస్తుతం జేమ్స్ వసంతన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.





.jpg)

