నయన ఏ మాయ చేస్తుందో..!
on May 17, 2016

ఎప్పుడో పదకొండేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైన నయనతార, ఇంకా సక్సెస్ ఫుల్ గా ఆఫర్లు తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. కుర్రహీరోల సినిమాల్లో కూడా రొమాన్స్ చేస్తున్న ఈ ముదురు భామ ఏ మాయ చేస్తుందో అంటూ తోటి హీరోయిన్లు గుసగుసలాడుతున్నారు. చిన్న గాసిప్ వచ్చినా, కెరీర్ కు ఎర్త్ పడిపోయే అవకాశాలు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన నయనతార కెరీర్ ఎన్ని ఎత్తులు, ఎన్ని లోతులు చూసిందో చెప్పక్కర్లేదు. తెలుగులో అయితే ముదురు పాత్రలు తప్ప, హీరోయిన్ గా పనికిరాదని డిసైడ్ చేసేశారు మనోళ్లు. మహా అయితే సీనియర్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం ఇద్దామనుకుంటున్నారు. అయితే తమిళ తంబీల టేస్టే వేరప్పా. ముప్ఫై ల్లో పడిన నయనకు మరిన్ని ఆఫర్లు ఇస్తూ మాంఛి ఎంకరేజ్ మెంట్ ఇస్తున్నారు. ముగ్గురితో ప్రేమాయణం, రజనీ, బాలయ్య, వెంకీ లాంటి సీనియర్ హీరోలతో సరసన చేస్తూ ముదురు హీరోయిన్ అనే ట్యాగు, అన్నింటి కంటే ముఖ్యంగా శింబుతో రచ్చకెక్కి పరువు తీసేసిన ప్రేమ వ్యవహారం..ఇలాంటి వన్నీ చూసేసిన నయన నేటికీ అగ్రస్థానంలో కొనసాగడం నిజంగా ఆశ్చర్యమే. అరవ జనమంతా నయన సినిమా అంటే చాలు ఎగబడి చూసేస్తున్నారు. కలెక్షన్లు కురిపించేస్తున్నారు..ఏమో..ఈవిడలో తెలుగోళ్లకు కనిపించని స్పెషాలిటీ వాళ్లకేం కనిపించిందో మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



