
విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల హీరో బ్రెయిన్‌కి ఇంజ్యూరీ అవుతుంది. అందువల్ల, హీరో ఎప్పుడూ '28 డిగ్రీస్' టెంపరేచర్‌లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అతడి చుట్టుపక్కల ప్రదేశాలు ఎప్పుడూ 28 డిగ్రీస్ టెంపరేచర్‌లో ఉండాలి. లేదంటే పది పదిహేను నిమిషాల్లో మరణించే ప్రమాదం ఉంది - ఇదీ '28 డిగ్రీస్' సినిమా పాయింట్. దీనికి ప్రేమ, పెళ్లి అంశాలు యాడ్ చేశారు. అటువంటి అరుదైన వ్యాధి కల హీరో నేపథ్యం ఏంటి? అతను ఏం చేశాడు? అనేది నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న '28 డిగ్రీస్' కథ. ఈ సినిమాకు అనిల్ విశ్వనాధ్ దర్శకుడు. '28 డిగ్రీస్' టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు... ఇదేదో కొత్తగా ఉందని అనుకున్నారంతా. ఈ రోజు విడుదలైన సినిమా టీజర్ కూడా కొత్తగా ఉంది. ఈమధ్య తెలుగు ప్రేక్షకులు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. ఈ పాయింట్‌ను సరిగా డీల్ చేసి ఉంటే నవీన్ చంద్ర అండ్ టీమ్‌కు సక్సెస్ గ్యారెంటీ.






