Home

»

Latest News

కీర్తి సురేశ్ ఖాతాలో మరో మహిళా సినిమా

Apr 27, 2019 12:53PM

 

'మహానటి' విడుదల తరవాత కీర్తీ సురేశ్‌పై ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు న‌మ్మ‌కం పెరిగింది. ఓ సినిమా బరువు బాధ్యత ఆమె మోయగలదని నమ్ముతున్నారు. కీర్తీ సురేశ్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మాణంలో ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, మరో సినిమా కూడా చేస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత, హిందీ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ ఒక ఫిమేల్ ఓరియెంటడ్ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఒక షెడ్యూల్ పూర్తి చేశామని దర్శకుడు తెలిపారు. నగేష్ కుకునూర్‌కు ఇదే తొలి తెలుగు సినిమా. ఆయన తెలుగులో సినిమా తీయడానికి కారణం ఏంటంటే.... నగేష్ పుట్టింది హైదరాబాద్ లోనే. వాళ్ళ అమ్మగారి మాతృభాష తెలుగు. కానీ, ఆయనకు తెలుగు చదవడం, రాయడం రాదు. ఈ సినిమా కాకుండా హిందీలో అక్షయ్ కుమార్ 'మిషన్ మంగళ్'లో కీర్తీ సురేష్ ఒక పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగణ్ సరసన హిందీలో మరో సినిమా చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com