
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'రంగస్థలం'లో రంగమ్మత్తగా అనసూయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకు ముందు 'క్షణం'లో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. టీవీ షోలతోనూ మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే... అదంతా ఒక ఎత్తు. 'రంగస్థలం'లో రంగమ్మత్త మరో ఎత్తు. 'రంగస్థలం' తరవాత మరో మెగా మూవీలో అనసూయకు అవకాశం వచ్చిందని టాక్. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో కీలక పాత్ర అనసూయకు దక్కిందట. ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది పూర్తయిన తరవాత కొరటాల శివ సినిమా స్టార్ట్ కానుంది. అలాగే, మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమాలోనూ అనసూయకు మంచి పాత్ర దక్కిందట. ఇక, ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'కథనం' సినిమా పూర్తయింది. త్వరలో విడుదల చేయనున్నారు.






