తిక్కల్ ఫ్యామిలీ.. నారాయణ కామెడీ మామూలుగా లేదు!
on Mar 29, 2023
ఒక్కోసారి చిన్న సినిమాలు ఏమాత్రం అంచనాల్లేకుండా సైలెంట్ గా వచ్చి సర్ ప్రైజ్ హిట్ కొడుతుంటాయి. 'నారాయణ అండ్ కో' అనే చిత్రం అలాంటి సర్ ప్రైజ్ హిట్ కొడుతుంది అనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ కడుపుబ్బా నవ్వుకునేలా ఉండి, వెంటనే సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.
సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'నారాయణ అండ్ కో'. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్న పాపిశెట్టి దర్శకుడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. మిల్లెట్స్ తో దేవుడి ప్రసాదం, శవంతో ఫ్యామిలీ ఫోటోలు వంటి సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది. తిక్కల్ ఫ్యామిలీకి కేరాఫ్ అడ్రెస్ లాంటి నారాయణ కుటుంబం.. ఓ పిల్లి బొమ్మ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. వినోదాన్ని నమ్ముకునే ఇలాంటి సినిమాలు విజయాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువ. మరి 'నారాయణ అండ్ కో' కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
