Home

»

Latest News

'నరసింహ నాయుడు' బాక్సాఫీస్ సునామీ తెలుసా: 105 టాటా సుమోలు ఎందుకు పంచారు!

Sep 21, 2026 6:07PM

 


తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు విజయాన్ని సాధిస్తే, మరికొన్ని సినిమాలు కొత్త చరిత్రని సృష్టిస్తాయి. ఆ చరిత్రకి ఆద్యుడు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అయితే.. ఆ  రికార్డుకే ఒక అందం, తలబిరుసు వస్తుంది. సరిగ్గా 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వన్ మాన్ షో 'నరసింహ నాయుడు' చిత్రానిది అదే పరిస్థితి.

మాస్ పల్స్, మీటర్స్ తెలిసిన  బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, టాలీవుడ్ రికార్డుల లెక్కలన్నింటినీ సిగ్గుతో తలవంచుకునేలా చేసింది  బాలయ్య అభినయం, పరుచూరి బ్రదర్స్   రాసిన పవర్ ఫుల్ డైలాగులు, మణిశర్మ అందించిన ఊరమాస్ సంగీతం థియేటర్లలో అభిమానులతో ఈలలు, కేకలు వేయించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన గణాంకాలు మరియు అసాధారణ మైలురాళ్ళు నేటికీ సినీప్రియలకు ఒక అద్భుతమైన జ్ఞాపకం.  72 సంవత్సరాల సుదీర్ఘ తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త రికార్డు నెలకొల్పుతూ, 'నరసింహ నాయుడు' ఏకంగా 105 కేంద్రాలలో నేరుగా 100 రోజుల వేడుకను జరుపుకొని ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. 


అంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా సాధించని రీతిలో 100 రోజులు వందకు పైగా సెంటర్లలో నడవడం అప్పట్లో ఒక సంచలనం.  ఈ రికార్డు చెప్పుకుంటూ మురిసిపోని బాలయ్య అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా, ఈ బ్లాక్ బస్టర్ మూవీ 18 కేంద్రాలలో విజయవంతంగా 175 రోజులు ప్రదర్శించబడి పూనకాలు తెప్పించింది. విడుదలైన రోజు నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ఆ కాలంలోనే  30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ నివ్వెరపాటుకి గురి చేసింది. 
 
బాలయ్య  కనబరిచిన విశ్వరూపం, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ మరియు తొడగొట్టి చెప్పే పవర్ ఫుల్ సంభాషణలు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్లేస్ నువ్వు చెప్పినా సరే,నన్ను చెప్పమని చెప్పినా సరే కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా',  అని బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ప్రతీ ఒక్కరి నోట నానుతూనే ఉంటాయి. ప్రతి మాట ఒక తపాసులా పేలింది. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ, నరసింహ నాయుడు ప్రభంజనం ముందు ఏ సినిమా నిలవలేకపోయింది.  


Also Read: ఫోటో రచ్చ: సిస్టమ్‌పై నీతులు చెప్పి ఇప్పుడిలాంటి ఫోటోలా!

 

 నరసింహ నాయుడు విజయంతో వరుసగా దాదాపు 5 సంవత్సరాల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ కథాంశంతో కూడిన భారీ సినిమాలు వెల్లువలా వచ్చాయి. సీమ మాస్ పవర్ ను వెండితెరపై ఎలా చూపించాలో  బి. గోపాల్ నిరూపించాడు. 'లక్స్ పాపా', 'చిలకపచ్చ కోక' వంటి పాటలు కుర్రకారును ఊపేస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. ఈ విధంగా  బాలయ్య బాబు నట విశ్వరూపానికి, నట డిక్షనరీకి, బాక్సాఫీస్ స్టామినాకి  'నరసింహ నాయుడు' ఒక శాశ్వతమైన నిదర్శనంగా నిలిచిపోయింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ వంద రోజుల ఫంక్షన్ అప్పుడు 105 కేంద్రాలలో వంద రోజులు ఆడిన దానికి గుర్తుగా థియేటర్ యాజమాన్యానికి 105 టాటా సుమోలు పంచడం జరిగింది. చిన్నికృష్ణ కథని అందించాడు. 

 

మీకు నచ్చవచ్చు: కుర్ర‌కారును ఉర్రూత‌లూగించిన 30 ఏళ్ల పాట‌.. ఎర్రాని కుర్ర‌దాన్ని గోపాల‌..

 

[Narasimha Naidu, Narasimha Naidu Box Office Records, Balakrishna,  B Gopal, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com