.webp)
సినీ ఫీల్డ్ అనేది గ్లామర్ ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. ఈ సత్యాన్ని ఎవరు కాదనలేరు. కానీ హీరోయిన్ క్యారక్టర్ ని ఆవిష్కరించే విధానంపై తరచూ అనేక చర్చలు, వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. ముఖ్యంగా వెండితెరపై ప్రదర్శించే గ్లామర్, కెమెరా కోణాలు బయట సమాజంలో నటీమణులు మాట్లాడే నీతులకు మధ్య కొట్టొచ్చినట్లు కనిపించే వైరుధ్యం మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కన్నడ అందం, తెలుగులో 'అమిగోస్', 'నా సామిరంగ' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్, నెటిజన్ల విమర్శల తుఫానుని ఎదుర్కొంటుంది. దీనికి ప్రధాన కారణం ఆమె గతంలో సినీ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు మరియు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద ఫోటో అనే ప్రచారం జరుగుతోంది.
కొద్దిరోజుల క్రితం 'పెద్ది' చిత్రం థియేటర్లలోకి వచ్చిన సమయంలో, అందులో జాన్వీ కపూర్ పోషించిన 'అచియ్యమ్మ' పాత్ర చిత్రీకరణ శైలిపై నెటిజన్లు, సినీ విమర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా నాయిక అంగసౌష్టవంపై జూమ్ చేస్తూ కెమెరా కోణాలు పెట్టడంపై గళం విప్పిన వారిలో ఆషికా రంగనాథ్ ముందంజలో ఉన్నారు. ఆ సమయంలో ఆమె సోషల్ మీడియాలో సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకుంటూ మేకర్స్ ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. "హీరోయిన్లను ఏ విషయంలోనూ తప్పుపట్టకండి... ఇప్పటికీ కేవలం గ్లామర్ మరియు అందాల ప్రదర్శన మాత్రమే అమ్ముడుపోతుందని భ్రమపడుతున్న ఈ ఇండస్ట్రీ సిస్టమ్‌ను, ఆ ఆలోచనా ధోరణి ఉన్న దర్శకులనే నిందించండి" అంటూ సుదీర్ఘ లెక్చర్ ఇచ్చి మహిళలను కేవలం గ్లామర్ వస్తువులుగా వాడుకుంటున్నారంటూ ఇండస్ట్రీ మైండ్ సెట్‌ని ఎండగట్టారు.
ఇది కూడా చదవండి: అనుమాన పక్షి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది: ది ప్యారడైజ్ కి పోటీ ఇస్తుందా!
అయితే ఆ నీతిబోధలు చేసి కొద్దిరోజులు కూడా గడవకముందే, ఆషికా తన సొంత ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక విచిత్రమైన ఫోటో అప్‌లోడ్ చేసింది. ఆ చిత్రంలో ఆమె కనీసం తన ముఖం కూడా కనిపించకుండా కేవలం నడుము, శరీర ఆకృతిని మాత్రమే హైలైట్ చేస్తూ క్రాప్ చేసిన ఫోటో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా విస్తుపోయి ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సినిమాల్లో దర్శకనిర్మాతలు గ్లామర్‌గా చూపిస్తే అది 'సిస్టమ్ తప్పు' అని వేలెత్తి చూపే మీరు, ఇప్పుడు స్వయంగా ముఖాన్ని కత్తిరించి కేవలం శరీరాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ ఫోటోలు పెట్టడానికి ఏ వ్యవస్థ మిమ్మల్ని బలవంతం చేసిందంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వ్యూస్, లైకులు, డిజిటల్ ఫాలోయింగ్ కోసమే సొంత సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి కంటెంట్‌ను ప్రదర్శించడం పక్కా కపటత్వం (Hypocrisy) కాదా అని నిలదీస్తున్నారు.
ఈ వివాదంపై ఆషికా స్పందిస్తూ, తాను మెడలో ధరించిన కెమెరా లాకెట్‌ను ప్రత్యేకంగా చూపించే ఉద్దేశంతోనే ఆ ఫోటోను క్రాప్ చేసి పెట్టానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆమె మాటలను ఏమాత్రం ఆమోదించడం లేదు. మెడలోని లాకెట్ చూపించడానికి నడుము భాగాన్ని క్రాప్ చేసి చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో 'మిస్ ఫ్రెష్ ఫేస్ 2014' రన్నరప్‌గా నిలిచి, మోడలింగ్ నుండి సినీ ప్రయాణం ప్రారంభించిన ఆషికా, ప్రస్తుతం 'విశ్వంభర', 'సర్దార్ 2' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో నటిస్తున్నారు. 100 శాతానికి పైగా ప్రొఫెషనలిజం ఉండాల్సిన ఇండస్ట్రీలో తెరపై గ్లామర్ చూపిస్తే వ్యవస్థ లోపమని ఉపన్యాసాలు దంచి, వ్యక్తిగత ఖాతాల్లో ముఖం లేకుండా శరీర భాగాన్ని ప్రదర్శించడం శుద్ధ డబుల్ స్టాండర్డ్స్ అని ఆన్‌లైన్ జనాలు విమర్శిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: జయ జయ శుభకర వినాయక: ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.!
[Ashika Ranganath, Ashika Ranganath Instagram Photo Controversy, Peddi Janhvi Kapoor Support, Telugu Cinema News, Latest Telugu Cinema News, TeluguOne Cinema News, TeluguOne]



.webp)


