.webp)
రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏమో ఏమో ఇది’. యువతను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ శీతాకాలంలో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రేమానుభూతిని అందించేందుకు సినిమా సిద్ధమవుతోంది.
‘HIT’ ఫ్రాంచైజీతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న రచయిత, దర్శకుడు శైలేష్ కొలను తొలిసారి ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తనదైన థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ‘ఏమో ఏమో ఇది’తో పూర్తిగా భిన్నమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్‌ల ఫ్రెష్ పెయిర్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ' ఏమో ఏమో ఇది’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వీడియో సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు, చిత్రంలోని ప్రేమకథ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని పెంచింది.
ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.!
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు:
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.. అమ్మాయి అందాన్ని ప్రకృతితో పోలుస్తూ వేటూరి చేసిన మ్యాజిక్.!
ఘాటైన ప్రేమ ఘటన.. బాలయ్య, రోజా ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ సాంగ్.!
[Emo Emo Idi Release Date, Emo Emo Idi Movie, Sailesh Kolanu, Roshan Meka, Preity Mukhundhan, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]





