రేపు రిలీజ్ అవుతున్న సినిమాలు
on Mar 10, 2016
ఈవారం రిలీజయ్యే సినిమాల్లో చిన్న సినిమాల ప్రభంజనమే ఎక్కువ. వీటిలో నారా రోహిత్ తుంటరి మూవీయే పెద్ద చిన్న సినిమా. దాదాపు 600 స్క్రీన్లలో రోహిత్ తుంటరి రిలీజవ్వబోతోంది. రేపు ఏం సినిమాలు రిలీజవుతున్నాయో చూడండి.
తుంటరి

నారా రోహిత్ హీరోగా, గుండెల్లో గోదారి, జోరు సినిమాలు తీసిన కుమార్ నాగేంద్ర డైరెక్ట్ చేసిన సినిమా తుంటరి. తమిళంలో హిట్టైన మాన్ కరాటే సినిమాకు ఇది రీమేక్. అక్కడ 55 కోట్లకు పైగానే వసూల్ చేసిన ఈ కథ తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
చిక్కడు దొరకడు

సిద్దార్ధ్, లక్ష్మీ మీనన్ జంటగా తమిళంలో వచ్చిన జిగర్తాండాను సాయి మణికంఠ క్రియేషన్స్ సంస్థ తెలుగులోకి చిక్కడు దొరకడు పేరుతో తీసుకొస్తోంది. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో, సిద్దార్ధ్ చాలా కొత్తగా ఉండే పాత్ర చేశాడని నిర్మాత చెబుతున్నారు.
తులసీదళం

సింగర్ ఆర్ పి పట్నాయక్ నటిస్తూ, దర్శక నిర్మాతగా చేసిన సినిమా తులసీదళం. హారర్ జానర్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులందరికీ తులసీదళమన్న పేరు బాగా తెలుసు. దీన్ని హర్రర్ లవ్ మూవీగా తెరకెక్కించానని చెబుతున్నారు ఆర్.పి. నిశ్చల్, వందనా గుప్తా జంటగా కీలక పాత్రలు పోషించారు. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం ఇలా కీలకమైన ఐదు శాఖలు ఆర్.పి హ్యాండిల్ చేయడం విశేషం.
ఓదార్పు యాత్ర
.jpg)
తమిళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన వజ్రం సినిమాను ఓదార్పు యాత్ర పేరుతో సాయిరంగా ఫిల్మ్స్ బ్యానర్ పై కె.రంగారావు తెలుగులోకి తీసుకొస్తున్నారు. యూత్ అండ్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఓదార్పు యాత్ర టైటిల్ పెట్టారు. పాలిటిక్స్ లో చాలా కీలకమైన ఈ టైటిల్ జనాన్ని హాల్ కి రప్పించగలదో లేదో చూడాలి.
మన్మథన్ ఫర్ సేల్

2012లో తమిళంలో రిలీజై ఫ్లాప్ అయిన పోరా పోడి సినిమాను తెలుగులో మన్మథన్ ఫర్ సేల్ పేరుతో దింపుతున్నారు. వివాదాల హీరో శింబు, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమాలో అడల్ట్ డోస్ కాస్త ఎక్కువే. మన్మధ ప్లస్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాల టైటిల్స్ ను కలిపేసి మన్మథన్ ఫర్ సేల్ అని టైటిల్ డిసైడ్ చేశారు.
ఓ స్త్రీ రేపు రా

గతంలో ఒక ఊళ్లో దయ్యం తిరుగుతుందంటూ భయపడి గోడలపై ఓ స్త్రీ రేపురా అని రాసేవారు. ఈ నిజగాథను సీరియల్ గా కూడా తీశారు. ఇదే కాన్సెప్ట్ ను సినిమాగా తీశారు అశోక్ రెడ్డి. స్వీయ నిర్మాణంలో ఆయన డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా రేపే రిలీజ్.
ఇవి కాక, బుల్లెట్ రాణి, నేను మా కాలేజ్ అంటూ మరో రెండు సినిమాలు కూడా రేపే రిలీజవుతున్నాయి. తుంటరి, తులసీదళం తప్పితే, మిగిలిన సినిమాలన్నీ ఇప్పటికే చాలా కాలంగా రిలీజ్ లు వాయిదా వేసుకుంటూ వచ్చాయి. మరి వీటిలో ఎన్ని కనీసం టేబుల్ ప్రాఫిట్ వరకూ వెళ్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



