సుబ్రమణ్యానికి మాంచి గిరాకీ
on Oct 15, 2015
.jpg)
టాలీవుడ్ మొత్తం ఇప్పుడు సుబ్రమణ్యాన్ని ఎంతో అభిమానిస్తోంది. ఇంతకీ సుబ్రమణ్యం అంటే ఎవరూ అనుకుంటున్నారా... ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనుకుంటున్నారు కదూ... కాదు... ధర్మవరపు సుబ్రమణ్యం అస్సలు కాదు.. ఎందుకంటే పాపం ఆయన మనమధ్య లేరు కదా..! మరింతకీ టాలీవుడ్ అంతగా అభిమానిస్తున్న సుబ్రమణ్యం ఎవరు? ఇక సస్సెన్స్ ఎందుకులెండి... ఆ సుబ్రమణ్యం మరెవరో కాదు... ‘సుబ్రమణ్యం’ అనే సినిమా టైటిల్.
.jpg)
ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో సుబ్రమణ్యం అనే పేరున్న మూడు సినిమాలు విడుదలయ్యాయి. అవి.. ఒకటి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, రెండు ఎవడే సుబ్రమణ్యం, మూడు సుబ్రమణ్యం ఫర్ సేల్. సుబ్రమణ్యం అని పేరు పెట్టుకున్న మూడు సినిమాలూ హిట్టయ్యాయి. దాంతో సెంటిమెంట్లకి కేరాఫ్ అడ్రస్ అయిన సినిమా ఫీల్డ్‌లో ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు సుబ్రమణ్యాన్ని అభిమానించేస్తున్నారు. టైటిల్లో సుబ్రమణ్యం అని పెట్టుకుంటే సినిమా హిట్టవుతుందని నమ్మకాలు పెట్టేసుకున్నారు.
సెట్స్ మీద వున్న రెండు సినిమాలకు ‘సుబ్రమణ్యం’ అనే పేరు కలిసేలా టైటిల్ పెట్టాలని ఆ సినిమాల దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకూ అయిన షూటింగ్‌లో హీరో పేరు మరోలా వున్నా డబ్బింగ్‌లో ‘సుబ్రమణ్యం’ అని మార్చుకునేందుకు కూడా ప్రిపేర్ అయిపోయారట. ఎవరి సెంటిమెంట్ వారికి ఆనందం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



