
నిజమే... 'వ్యూహం' సుధీర్‌బాబుదే, అందులో నాని కనిపిస్తారని ఇండస్ట్రీ గుసగుస. నాని, సుధీర్‌బాబు కథానాయకులుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ సిన్మా చేయడానికి అంగీకరించారు కదా! ఈ మల్టీస్టారర్‌లో సుధీర్‌బాబు పాత్ర నిడివి ఎక్కువగా, నాని పాత్ర నిడివి తక్కువగా ఉంటాయట! అయితే... ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందట! నిడివి తక్కువ అయినప్పటినీ నాని ఎందుకు 'యస్' అన్నాడు అంటే... కథ, కథలో ఆయన పాత్ర విపరీతంగా నచ్చాయట! 'అష్టా చమ్మా'తో నానిని కథానాయకుడిగా పరిచయం చేసింది మోహనకృష్ణ ఇంద్రగంటే. తర్వాత 'జెంటిల్‌మన్' సినిమాతో నానికి ఆయన మరో విజయాన్ని అందించారు. అందువల్ల, నాని ఈ సినిమాకు 'యస్' చెప్పి ఉండొచ్చు. ఇక, సుధీర్‌బాబుకు 'సమ్మోహనం' వంటి సుకుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి విజయాన్ని ఇంద్రగంటి అందించారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాకు 'వ్యూహం' టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.






