Home

»

Latest News

చంద్రబాబు అభిమానులే.. వెన్నుపోటు చిత్రానికి వర్క్‌ చేశారు!

Mar 30, 2019 3:16PM

 

'ఇది కుట్రల చిత్రం... వెన్నుపోటు పర్వం' అంటూ రామ్‌గోపాల్‌ వర్మ చెబుతున్న, తీసిన చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'. ఇదే 'అసలు కథ' అని క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఏపీలో మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ సినిమాపై చంద్రబాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ వాస్తవాలను వక్రీకరించారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రంలో చంద్రబాబును చెడుగా చూపించారనేది వాస్తవం. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే... ఈ చిత్రానికి సంగీతం అందించిన కల్యాణీ మాలిక్‌ తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఆయనే ఈ సంగతి చెప్పారు. అలాగే, తన తల్లిదండ్రులు చంద్రబాబు అభిమానులని పాటల రచయిత సిరాశ్రీ చెప్పారు. వీరిద్దరూ కలిసి 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో పాటలు చేశారు.

'సినిమాపై చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం అభిమానుల వ్యతిరేకత మీపై పడుతుందని ఎప్పుడైనా ఆందోళన చెందారా?' అనే వీరిద్దరినీ ప్రశ్నిస్తే... సిరాశ్రీ మాట్లాడుతూ "మా తల్లిదండ్రులకు, ఇంట్లో చంద్రబాబు అభిమానులకు పాటలు, సాహిత్యం నచ్చాయి. కానీ, వారు సినిమాను చూడలనుకోవడం లేదు. ఎందుకంటే... చంద్రబాబు అభిమానులు కనుక. బయట ప్రేక్షకులు కూడా పాటలను, సినిమాను సపరేట్‌గా చూస్తారని భావిస్తున్నా. ఇక, మాపై వ్యతిరేకత వస్తుందని ఎప్పుడూ ఆందోళన చెందలేదు" అని సమాధానం ఇచ్చారు. 'ధగా...' పాట కోసం ఎక్కువ వెర్షన్స్‌ రాసినట్టు ఆయన తెలిపారు. ఆల్మోస్ట్‌ అందులో పదాలన్నీ రామ్‌ గోపాల్‌ వర్మవే అన్నారు. కల్యాణీ మాలిక్‌ మాట్లాడుతూ 'సినిమాను సినిమాగా భావించి పని చేశా. వ్యక్తిగతం వేరు. వృత్తి వేరు. నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిని. ఓసారి ఎన్నికల్లో నా ఓటు రాలేదని బాధపడ్డా' అన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ సినిమాకు కల్యాణీ మాలిక్‌ పని చేయడం ఇదే తొలిసారి. ఆయన పేరును వర్మకు సిరాశ్రీ సూచించారు. విశేషం ఏంటంటే... కల్యాణీ మాలిక్‌, సిరాశ్రీ కలిసి పని చేయడం కూడా ఇదే తొలిసారి. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ముందువరకూ కల్యాణీ మాలిక్‌ సంగీతంలో పాటలు రాయకున్నా... వర్మ కోరుకున్న సంగీతానికి ఆయనే కరెక్ట్‌ అని తాను భావించాననీ, వర్మకు 'ఊహలు గుసగుసలాడే' చిత్రంలో 'ఏం సందేహం లేదు' పాటను వినిపించగా ఓకే చేశారని సిరాశ్రీ తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com