ఫ్లాప్ దర్శకునితో మరో సినిమా చేయబోతున్న నాని!
on Feb 11, 2023

టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లలో వివేక్ ఆత్రేయ ఒకరు. ఆయన ఇంతకుముందు చిన్న సినిమాలుగా తీసిన బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో సినిమాలు మంచి విజయం సాధించాయి. బ్రోచేవారెవరురా చిత్రం క్రైమ్ కామెడీ సినిమా కాదా మెంటల్ మదిలో చిత్రం రొమాంటిక్ కామెడీ సినిమా. కానీ తాజాగా ఆయన నేచురల్ స్టార్ నానితో అంటే సుందరానికి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన అంటే..సుందరానికి మూవీని తీసి ఆయన మెప్పించలేకపోయారు.
మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ బ్యానర్‌లో నిర్మితమైన ఈ సినిమా సినీ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. రన్ టైం ఎక్కువగా ఉండడం, సినిమా సాగతీతగా అనిపించడం, అనవసర సీనులతో కథలోకి డైరెక్టర్‌గా వెళ్లకపోవడం, అసలు దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ప్రేక్షకులకు అర్థం కావడానికి చాలా సమయం పట్టడం ఇలా పలు కారణాలవల్ల ఈ సినిమా డిజాస్టర్ అయింది.
కానీ అంతకు ముందు తీసిన మెంటల్ మదిలో బ్రోచేవారు హిట్ అయ్యాయి. నానికి కూడా అంటే సుందరానికి ముందు శ్యాం సింగరాయ వంటి మంచి హిట్ వచ్చింది. దాంతో ఆత్రేయ నాని కాంబినేషన్ మూవీ పై అంచనాలు పెరిగాయి. ఇది కూడా ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. తాజాగా నానికి డిజాస్టర్ అందించిన వివేక్ ఆత్రేయ మరోసారి నానితో కలిసి ఎలాగైనా ఒక సినిమా హిట్టు కొట్టాలని భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయ- నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈసారి మంచి ఎంటర్టైనర్ కథతో వివేక్ ఆత్రేయ నానిని మెప్పించారట.
అంటే సుందరానికి డిజాస్టర్ ను మర్చిపోయేలా ఈ సినిమా తీయాలని వివేక్ ఆతేయా పట్టుదలగా ఉన్నారు. ఈ కాంబినేషన్ పై త్వరలో మూవీ టీం నుండి అధికార ప్రకటన వస్తుంది. మరి ఈ చిత్రంలో నాని సరసన ఎవరుంటారు? ఈ సినిమా ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుంది? అన్ని విషయాలు తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



