Home

»

Latest News

నాని 25... 'వి' ఫర్ విలన్!

Apr 29, 2019 12:21PM

 

'అష్టా చమ్మ'తో నాని కథానాయకుడిగా పరిచయం చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయనే నానిని ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ విషయాన్ని నాచురల్ స్టార్ స్పష్టం చేశాడు. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, నాని, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ప్రధానపాత్రధారులుగా 'దిల్' రాజు ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'వి' టైటిల్ ఖరారు చేసినట్టు ఈరోజు తెలిపారు. అలాగే, తాను విలన్ గా నటిస్తున్నట్టు నాని ట్వీట్ చేశారు. "నా తొలి సినిమాలో ఆయన నన్ను హీరోగా పరిచయం చేశారు. ఈరోజు నా 25వ సినిమాలో నన్ను మరోసారి పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి డిఫరెంట్ గా పరిచయం చేయబోతున్నారు. యువర్ ఫ్రెండ్లీ నెయిబర్ హుడ్ విలన్" అని నాని పేర్కొన్నారు. దర్శకుడి దృష్టిలో 'వి' అంటే ఏంటో మరి? ఈ సినిమా వరకూ నానికి 'వి' అంటే విలనే. 'వి' ఫర్ విలన్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com