Home

»

Latest News

హాలీవుడ్ నుంచి సూప‌ర్ స్టార్ కు ఆహ్వానం!!

Apr 29, 2019 4:55PM

 

టాలీవుడ్ చేస్తోన్న ప్ర‌యోగాల రీత్యా తెలుగు సినిమా  ప్ర‌స్తుతం  వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు పొందుతోంది.  ఇటీవ‌ల మేడ‌మ్ టుస్సాడ్స్ లో స్థానం సంపాదించుకున్న మ‌హేష్ బాబుకి హాలీవ‌డ్ నుంచి క‌బురొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌సారి ఆ వివ‌రాల్లోకి వెళితే... క‌మాండో, ప్రిడేట‌ర్ ఎక్స్ మ‌న్ లాంటి చిత్రాల హాలీవుడ్ కు చెందిన ఫేమ‌స్ యాక్ట‌ర్  బిల్ డ్యూక్ కు మ‌న తెలుగు వారిపై దృష్టి ప‌డింది.  `మీరు ఈ సారి లాస్ ఏంజెల్స్ కు వ‌చ్చిన‌ప్పుడు ఒక‌సారి భోజ‌నానికి రండి. మ‌నం ఇంట‌ర్నేష‌న‌ల్ స్పై సినిమా గురించి చ‌ర్చించుకుందాం అని  మ‌న స్టూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు,  డైర‌క్ట‌ర్ మురుగుదాస్, వంశీ పైడిప‌ల్లికి ట్వీట్ చేసాడు బిల్ డ్యూక్.  ఇలా ఒక హాలీవుడ్ స్టార్ మ‌హేష్ కు ట్యాగ్ చేయ‌డంతో ఇప్పుడు మ‌హేష్ అభిమానులు పిచ్చ హ్యాపీగా ఫీల‌వుతున్నారు.  నిజంగా ఇలా ఒక హాలీవుడ్ స్టార్ మ‌న తెలుగు వారికి ట్యాగ్ చేస్తూ భోజనానికి ఆహ్వానించ‌డం, ఇంట‌ర్నేష‌న‌ల్ స్పై మూవీ గురించి చ‌ర్చించుదాం అన‌డం గొప్ప విష‌య‌మే క‌దా అంటున్నారు సినీ జ‌నాలు. మ‌న తెలుగు సినిమా స్టామినా అంటే అది మ‌రి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com